సమంత ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా చలామణి అయిన వారిలో సమంత ఒకరు. ఈ చిన్నది టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి అగ్ర తారల లిస్ట్ లో చేరిందని చెప్పవచ్చు. దాదాపు ఈ చిన్నది చిత్రపరిశ్రమకు పరిచయమై చాలా సంవత్సరాలు అయినప్పటికీ సమంత ఇప్పటికీ కూడా వరుస సినిమా ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.


ప్రస్తుతం సమంత చేతినిండా సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సమంత తెలుగులో మరో సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుందట. అది కూడా అల్లు అర్జున్ సినిమాలో కావడం విశేషం. అట్లీ - అల్లు అర్జున్ కాంబినేషన్లో 'AA 22' సినిమాను తీయబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించారు. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అట్లీ నిర్ణయం తీసుకున్నారట.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చాలామందిని అనుకుంటున్నప్పటికీ ఫైనల్ గా సమంతను పెట్టి సినిమా తీస్తే బాగుంటుందని అట్లీ భావించారట. ఇదివరకే అల్లు అర్జున్, సమంత కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకోగా.... మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తీయాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారు. ఇక ఈ సినిమాలో సమంతతో పాటు మరో హీరోయిన్ కూడా ఉండనుంది.

అయితే సమంతను అల్లు అర్జున్ ప్రియురాలిగా సెలెక్ట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అట్లీ అనుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: