నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న కృతి శెట్టి తెలుగులో వరుసగా సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా సక్సెస్ మాత్రం కలిసి రావడం లేదు.



తాను నటించిన సినిమాలన్నీ యావరేజ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఈ బ్యూటీని ప్రేక్షకులు ఆదరించినప్పటికీ సినిమాల పరంగా విఫలమవుతోంది. ప్రస్తుతం కృతి శెట్టికి పెద్దగా సినిమా అవకాశాలు కూడా రావడం లేదు. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సినిమాలలో అవకాశాలను అందుకుంటూ తన కెరీర్ ను సాఫీగా కొనసాగిస్తోంది. ఇక కృతి శెట్టి అవకాశాల కోసం సోషల్ మీడియాలో తన అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ అవి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


ఈ ఫోటోలో కృతి శెట్టి తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులిస్తోంది. అయినప్పటికీ కృతికి పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. ఇదిలా ఉండగా... ఈ చిన్న దానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. కృతి శెట్టికి ఓ తమిళ హీరోతో ఎఫైర్ ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోతో ఈ బ్యూటీ సీక్రెట్ గా ప్రేమాయణం కొనసాగిస్తుందని త్వరలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. మరి ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం బయటికి రాలేదు. ఈ విషయంపైన కృతి శెట్టి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: