మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు పొందిన మోహన్ లాల్ ఇప్పటికీ ఎన్నో చిత్రాలలో  నటిస్తూ మంచి విజయాలను అందుకుంటు ఉన్నారు. అయితే ఈయన కుమారుడు ప్రణవ్ కూడా హీరోయిన్గా పలు చిత్రాలలో నటించి పరవాలేదు అనిపించుకుంటున్నారు. అయితే ఇటీవలే కాలంలో యువ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తో ప్రేమలో ఉన్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపైన ప్రముఖ డైరెక్టర్ అలెప్పి అష్రఫ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.


డైరెక్టర్ అలెప్పి అష్రఫ్ మాట్లాడుతూ రెండు కుటుంబాలు తనకి బాగా పరిచయం ఉన్నదని.. వీరి ప్రేమ వార్తల పైన (కళ్యాణి తల్లి) లీజి సంప్రదించానని అయితే ఈ వార్త నిజమైతే తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని కూడా తెలియజేసిందట. కానీ ఆమె సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని కేవలం తమ పిల్లల మధ్య స్నేహం మాత్రమే ఉందంటూ తేల్చి చెప్పిందని తెలిపారు డైరెక్టర్ అలెప్పి అష్రఫ్. కానీ ప్రణవ్ ప్రేమలో ఉన్న సంగతి నిజమే అయితే అది ఇక్కడ అమ్మాయి కాదు జర్మనీ అమ్మాయితో అంటూ తెలియజేశారు డైరెక్టర్.


అయితే ఈ విషయం విన్న అటు హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ అభిమానులు మాత్రం కొంతమేరకు నిరాశతో ఉన్నారు. మొదటిసారి 2002లో ప్రణవ్, కళ్యాణి కాంబినేషన్లో వచ్చిన హృదయం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఈ జంట లవ్ బర్డ్స్ గా కనిపించి అందరిని కూడా ఆకట్టుకున్నారు అలా ఆ తర్వాత వీరిద్దరూ కూడా పలు సినిమాలలో కలిసి పని చేయడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లుగా ప్రచారం అయితే జరిగిందట. ప్రణవ్  స్టార్ ఫ్యామిలీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తన జీవితాన్ని తనకు ఇష్టం వచ్చినట్లుగా గడిపేస్తున్నారు. వర్క్ అనే ప్రోగ్రాంలో స్పెయిన్ లో ఒక ఫామ్ లో కూడా ఉన్నారు ప్రణవ్.. అయితే అక్కడ కూడా ఒక సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: