
విజయశాంతి తన 15వ ఎట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది .అలా ఆమె 47 ఏళ్ల నుంచి సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నది. విజయశాంతి తెలుగు ,కన్నడ, మలయాళం, తమిళ్ ,హిందీ వంటి భాషలలో సుమారుగా 200 పైగా చిత్రాలలో నటించింది. ఎంతోమంది అగ్ర హీరోలతో నటించిన విజయశాంతి మొదట రూ.5000 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునేదట. అలా పదేళ్లకే ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న మొట్టమొదటి హీరోయిన్గా పేరు సంపాదించింది.
విజయశాంతి ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి బారి పాపులారిటీ అందుకుంది. అలా కెరియర్ పిక్స్ ఉన్న సమయంలో పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చి తన సినీ కెరియర్ని వదిలేసుకుంది.విజయశాంతి మ్యారేజ్ 1988లో జరిగింది. విజయశాంతి తన భర్త శ్రీనివాస్ ప్రశాంత్ తో తన వైవాహిక జీవితాన్ని గడుపుతోంది. అయితే 2014లో విజయశాంతి అనారోగ్య సమస్యల వల్ల సర్జరీ చేయించుకున్నదట.. .. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు విజయశాంతి పిల్లల్ని కనకపోవడానికి ఒక కారణం ఉన్నదట. తన జీవితాన్ని ప్రజలకి అంకితం చేయాలని ఉద్దేశంతోనే ఆమె పిల్లల్ని కనలేదట.తన మరణాంతరం కూడా తన ఆస్తి మొత్తం కూడా తన తల్లి పేరున ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి.. వైద్య, విద్య కోసం తన ఆస్తి మొత్తాన్ని ఆ ట్రస్ట్ కి కేటాయిస్తానంటూ విజయశాంతి తెలియజేసింది.