సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో  కొంతమంది నటీనటులు మాట్లాడిన మాటలను మరో విధంగా ట్రోల్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆకతాయిలు. వాళ్ళు ఒకటి మాట్లాడితే  వారు మరో విధంగా దాన్ని మీడియాలో వైరల్ చేసి  ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. తాజాగా ఈ హీరోయిన్ మాట్లాడిన మాటలు ఆ స్టార్ హీరోకు జతకట్టి, సమస్యల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ హీరోయిన్ ఎవరు.. ఏ హీరో గురించి అలా మాట్లాడింది వివరాలు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ పూజా హెగ్డే అంటే తెలియని వారు ఉండరు. ఈమె ఇండస్ట్రీలో సినిమాల్లో చేసిన దానికంటే ఎక్కువ ఒక పాట ద్వారానే  స్టార్ హీరోయిన్ గా మారింది. ఇంతకీ ఆ పాట ఏంటయ్యా అంటే.. రామ్ చరణ్ హీరోగా వచ్చిన  రంగస్థలం సినిమా అందరికీ తెలిసే ఉంటుంది.. ఈ చిత్రంలో జిగేలు రాణి అనే ఐటమ్ సాంగ్ ఎంత పాపులారిటీ పొందిందో అందరికీ తెలుసు. 

ఇందులో పూజా హెగ్డే పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. అప్పటివరకు ఇండస్ట్రీలో అంతగా వెలుగులోకి రాని పూజ హెగ్డే ఈ పాట ద్వారా ఒక్కసారిగా పాపులారిటీ అందుకుంది. తర్వాత ఆమెకు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అరవింద సమేత, అలవైకుంఠపురం చిత్రాలు ఆఫర్స్ వచ్చాయి. ఈ సినిమాలు కూడా బంపర్ హిట్ అవ్వడంతో  స్టార్ హీరోయిన్ల లిస్టులో పూజా హెగ్డే కూడా పడిపోయిందని చెప్పవచ్చు. ఇక తర్వాత కొన్ని ప్లాపులు పడడంతో ఆమె తిరిగి ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్ వైపు వెళ్ళింది. అక్కడ కూడా స్టార్స్ తో సినిమాలు చేసి అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ ప్లేట్ ఫిరాయించి సౌత్ సినిమాల వైపు తన దృష్టి మళ్లించింది. సూర్య హీరోగా రెట్రో సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని  ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. 

 ఇన్స్టాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నా కానీ  వారంతా సినిమాకు వస్తారని కాదు. టికెట్ తెగిన వాళ్లే సినిమాకు వస్తారు. కొంతమంది సూపర్ స్టార్ కు మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు కానీ వాళ్ళ సినిమాలకు కోట్లాదిమంది అభిమానులు వస్తారు. ఈ విధంగా పూజా హెగ్డే చెప్పిన మాటలను కొంతమంది రామ్ చరణ్ పై కన్వర్ట్ చేసి  రామ్ చరణ్ కు ఇన్స్టాలో 27 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కానీ గేమ్ చేంజర్ సినిమా చాలా దారుణంగా ఫ్లాప్ అయింది. అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఫోటో పాలోవర్స్ పేజ్ పెట్టి వీడియోను ట్యాగ్ చేసి వైరల్ చేస్తున్నారు. అయితే పూజ హెగ్డే సాధారణంగానే మాట్లాడితే దాన్ని రామ్ చరణ్ వైపు తిప్పి ఆమెను అభసు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు.

మరింత సమాచారం తెలుసుకోండి: