కొన్ని సందర్భాలలో ఒకే తేదీన అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇకపోతే ఈ సంవత్సరం మే 1 వ తేదీన కూడా ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ఓ మూడు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ రైస్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయమన్నారు.

ఇకపోతే తమిళ నటుడు సూర్య హీరోగా రూపొందిన రైట్రో మూవీ ని కూడా మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... కార్తీక్ సుబ్బరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ "రైడ్" అనే మూవీ లో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇక తాజాగా రైడ్ మూవీ కి కొనసాగింపుగా రైడ్ 2 అనే మూవీ ని రూపొందించారు. ఇందులో కూడా అజయ్ దేవగన్ హీరో గా నటించాడు.

మూవీ ని కూడా మే 1 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూడు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూడు మూవీలలో కూడా బుక్ మై షో లో అత్యధిక ఇంట్రెస్ట్ లను సాధించిన సినిమాల లిస్ట్ లో రెట్రో మూవీ మొదటి స్థానంలో కొనసాగుతుంది. రెట్రో మూవీ కి బుక్ మై షో లో 112 కే ఇంట్రెస్ట్ లు లభించగా ... రైడ్  2 మూవీ కి 62.2 కే ఇంట్రెస్ట్ లు లభించాయి. హిట్ ది థర్డ్ కేస్ మూవీ కి 58.6 కే ఇంట్రెస్ట్ లు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: