తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన తన కెరీర్లో చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ ఈయనకు డీజే టిల్లు , టిల్లు స్క్వేర్ మూవీల ద్వారా అద్భుతమైన విజయాలను దక్కాయి. ఇకపోతే డీజే టిల్లు , టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సిద్దు జొన్నలగడ్డ తాజాగా జాక్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయి ఇంపాక్ట్ ను చూపలేక పోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన 8 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

8 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.60 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 39 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 1.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 8 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.39 కోట్ల షేర్ ... 7.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 8 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 1.26 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో 4.65 కోట్ల షేర్ ... 9.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ 18 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ 13.35 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. వరుసగా రెండు భారీ విజయాలను అందుకున్న సిద్దుకు జాక్ మూవీ ద్వారా భారీ అపజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: