మాస్ మహారాజా రవితేజ హీరోగా ఆసిన్ హీరోయిన్గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం అమ్మానాన్న ఓ తమిళమ్మాయి అనే సినిమా రూపొందిన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రవితేజకు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించగా ... తల్లి పాత్రలో జయసుధ నటించింది. ఈ మూవీ కి చక్రి సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ 2003 వ సంవత్సరం ఏప్రిల్ 19 వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నేటితో 22 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా స్టార్ట్ కావడానికి ముందు జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసు కుందాం.

పూరి జగన్నాథ్ "అమ్మానాన్న ఓ తమిళమ్మాయి" సినిమా కథ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత దానిని మొదట పవన్ కళ్యాణ్ తో చేయాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ను కలిసి ఆ మూవీ కథ మొత్తాన్ని కూడా చెప్పాడట. కథ మొత్తం విన్నాక పవన్ కళ్యాణ్ సినిమా చేద్దాం అన్నట్లే స్పందించాడట. కానీ ఆ తర్వాత పవన్ దగ్గర నుండి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో పవన్ కి ఈ సినిమా చేయడం ఇష్టం లేదు అనే ఉద్దేశంతో పూరి జగన్నాథ్ ఇదే కథను రవితేజ కు వినిపించాడట. రవితేజ కు ఈ మూవీ కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేద్దాం అని పూరి జగన్నాథ్ కి చెప్పాడట. అలా మొదట పూరి జగన్నాథ్ , పవన్ తో అనుకున్నా సినిమాను రవితేజ తో రూపొందించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: