కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఆజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో అజిత్ అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా మంచి విజయాలు మాత్రం అజిత్ కి దక్కడం లేదు. కొంత కాలం క్రితమే అజిత్ "విడ ముయార్చి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తెలుగు లో పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ తమిళ్ బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మాత్రం ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇకపోతే తాజాగా అజిత్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" అనే సినిమా లో హీరో గా నటించాడు.

మూవీ కి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. జీ వీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో సరైన విజయం లేని అజిత్ కుమార్ కి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ద్వారా బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది. ఇప్పటికే కూడా ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak