టైం బాగోలేనప్పుడు మనం ఏవేవో అనుకుంటూ ఉంటాం.  కొంతమంది టైంబ్యాడ్ అని.. మరి కొంతమంది మనకి రాసి పెట్టలేదు అని .. మరి కొంతమంది దరిద్రం నెత్తి మీద తాండవం చేస్తుంది అంటూ వర్ణిస్తూ ఉంటారు . ఇప్పుడు నాగచైతన్య ని కూడా అదే విధంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . దానికి కారణం నాగచైతన్య మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను వదిలేసుకోవడమే. ఆ సినిమాలో రామ్ చరణ్ ఖాతాలో పడి సూపర్ డూపర్ హిట్టుగా మారాయి.  ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది .


రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలాంటి స్థానంలో ఉన్నాడో అందరికీ తెలుసు . రామ్ చరణ్ వన్ ఆఫ్ ద టాప్ హీరోగా ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నాడు . అయితే రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ ఛేంజర్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు . ప్రజెంట్ బుచ్చి బాబు సినిమాతో అభిమానులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.  ఇలాంటి మూమెంట్లోనే ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది.  నాగచైతన్య చేయాల్సిన మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు రాంచరణ్ ఖాతాలో పడ్డాయి అని అది రాంచరణ్ కెరియర్ కి బాగా ప్లస్ అయ్యింది అని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఆ మూడు సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!



"మగధీర".. రామ్ చరణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ . నిజానికి మగధీర సినిమాను ముందుగా రాజమౌళి నాగచైతన్యతో తెరకెక్కించాలి అనుకున్నారట . కానీ నాగచైతన్యకి అప్పుడు అంత ఫిజిక్ లేదు అఫ్కోర్స్ ఇప్పుడు కూడా అంత ఫిజిక్ లేదు . మగధీర సినిమాకి కొంచెం ఫిజిక్ ఉండాలి . నాగ చైతన్య కి అప్పట్లో ఫిజిక్ పెంచమని చెప్పిన ఇంట్రెస్ట్ చూపించలేదట. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో మొదటిగా హీరోగా నాగచైతన్యని  అనుకున్నారట కానీ ఆయన ఇది నేచురల్ గా ఉన్న పాత్ర కావడం బాగా చెవిటి క్యారెక్టర్ నటించాలి అని చెప్పడంతో రిజెక్ట్ చేశారట .



ఇక ఆ తర్వాత పెద్ది సినిమా కూడా మొదటగా నాగ చైతన్య ఖాతాలోకి వెళ్లాల్సింది. బుచ్చి బాబు  దర్శకత్వం లో తెరకెక్కుతున్న  ఈ సినిమా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన తర్వాత బుచ్చిబాబు ఈ కథను పట్టుకొని చాలామంది స్టార్స్ ఇంటి చుట్టూరు తిరిగారు అందులో నాగచైతన్య కూడా ఉన్నారట. ఆశ్చర్యమేంటంటే నాగచైతన్య కూడా ఈ క్యారెక్టర్ రిజెక్ట్ చేశారు .ఇలా మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేసి నాగచైతన్య బిగ్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: