
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయిక లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమా గా తెరకెక్కుతుండగా దీనిపై అంచనా లు నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ లేట్ గానే స్టార్ట్ అయినా ఇప్పుడు శరవేగం గా కంప్లీట్ అవుతోంది. ఈ సినిమా పై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వినిపిస్తోంది. ఇక ఈ సినిమా గురించి ఓ అదిరి పోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా అప్పుడే మూడో షెడ్యూల్ లోకి వెళ్లిపోయిందట.
చాలా సైలెంట్ గా అప్పుడే మూడో షెడ్యూల్లోకి వెళ్లి పోవడం అంటే మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే చాలా సైలెంట్ గా జక్కన్న అండ్ టీం ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేస్తోంది . ఈ కొత్త షెడ్యూల్లో నటి ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మాత్రం ఈ భారీ సినిమా ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది అని చెప్పాలి. ఇక త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ రాజమౌళి మహేష్ బాబుతో ఈ సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా ఈ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత డాక్టర్ కేఎల్ నారాయణ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. 2027 లో ఈ క్రేజీ ప్రాజెక్టు ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.