సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం అతిథి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అమృతా రావు ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ 2007 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడంలో విఫలం అయింది.

చివరగా ఈ మూవీ ద్వారా మహేష్ కు అపజయం దక్కింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ మూవీ ని మే 31 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే మహేష్ హీరోగా రూపొందిన అనేక సినిమాలను ఇప్పటికే రు రిలీజ్ చేశారు. అందులో భాగంగా మహేష్ హీరోగా నటించిన అనేక సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అతిధి సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తుంది అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: