సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మహేష్ బాబు మంచితనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు. ప్రిన్స్ అందం గురించి ఎంత పొగిడిన తక్కువే. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటారో.. ఆయన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది.
 
అయితే స్టార్ హీరో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణది మే 31న జయంతి. ఈ జయంతి సందర్భంగా మహేష్ బాబు నటించిన ఒక మంచి సినిమా తెరపైకి రానుంది. మహేష్ బాబు హీరోగా నటించిన అతిథి సినిమాని వచ్చే నెల 31న రీరిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అమృత రావు హీరోయిన్ గా నటించింది. 2007లో థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా యావరేజ్ అయినప్పటికీ.. మంచి కంటెంట్ ఉన్న సినిమా అయినందున రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ చూస్తున్నారు. మరి ఈ సినిమా ఇప్పుడు సక్సెస్ సాదిస్తుందా లేదా చూడాలి మరి.

 
ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎట్టకేలకు సినిమా రాబోతుంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూటింగ్  కూడా మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు, జక్కన్న కాంబోలో వస్తున్న ఈ సినిమాలో నుంచి ఒక్క పిక్ కూడా లీక్ అవ్వకోడదని ప్రిన్స్ మహేష్ బాబుతో, జక్కన్న ముందే నో మోర్ లీక్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇటీవల హోలీ పండుగకి  కూడా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, జకన్నతో కలిసి ఒడిశాలో షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: