ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎట్టకేలకు సినిమా రాబోతుంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ షూటింగ్  కూడా మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు, జక్కన్న కాంబోలో వస్తున్న ఈ సినిమాలో నుంచి ఒక్క పిక్ కూడా లీక్ అవ్వకోడదని ప్రిన్స్ మహేష్ బాబుతో, జక్కన్న ముందే నో మోర్ లీక్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇటీవల హోలీ పండుగకి  కూడా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, జకన్నతో కలిసి ఒడిశాలో షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు ఉంటుందని సమాచారం.
 
స్టార్ నటులు, డైరెక్టర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా గురించి ఒక అప్డేట్ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే మూడో షెడ్యూల్ లోకి ఎంటర్ అయ్యింది అంట. ఈ సినిమా పనులు సైలెంట్ గానే జరుగుతున్న.. వేగంగా కూడా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయిన విషయం తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో ఇదే బిగెస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా బీజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

 
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మహేష్ బాబు మంచితనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు. ప్రిన్స్ అందం గురించి ఎంత పొగిడిన తక్కువే. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటారో.. ఆయన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఇక ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: