సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా రోజుల నుండి వినిపిస్తున్న మాట. ఇది ఇండస్ట్రీ మొదలైన అప్పటినుండి ఉంది. అయితే సౌత్ తో పోల్చుకుంటే నార్త్లో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది.కానీ వాళ్ళు ఫెయిడ్ అవుట్ అయిపోయాక ఆ విషయాన్ని బయట పెడుతూ ఉంటారు.కానీ ఇప్పటి జనరేషన్ నటీమణులు మాత్రం ధైర్యంగానే కొన్ని విషయాలను బయటపెడుతున్నారు.కానీ వారి పేర్లు కొంతమంది చెబితే కొంతమంది చెప్పరు. అయితే తాజాగా వరుణ్ సందేశ్ బ్యూటీ చేసిన కామెంట్లు మాత్రం బీటౌన్ లో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇక విషయంలోకి వెళ్తే..వరుణ్ సందేష్ హీరోగా నటించిన లవర్ బాయ్ అనే మూవీలో హీరోయిన్ గా  నటించిన ప్రతీక రావు  తాజాగా ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ ని డిలీట్ చేయాలని కోరింది.అయితే ఆ పోస్టులో ఆ నెటిజన్ ఏం పెట్టారంటే.. బాలీవుడ్ హర్షత్ అరోరా ప్రతిక రావు ఇద్దరు కలిసి నటించిన బెయింటేహ అనే సీరియల్ లోని కొన్ని సన్నివేశాలను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 

అయితే ఆ వీడియో చూసిన ప్రతిక రావు ఆ పోస్ట్ డిలీట్ చేయమని కోరింది.కానీ ఆ నెటిజన్ మాత్రం డిలీట్ చేయలేదు సరి కదా ఆయనతో కలిసి నటించినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడేం వచ్చింది అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు. అయితే ఆ నెటిజన్ ఇచ్చిన సమాధానానికి మండిపోయిన ప్రతిక రావు సంచలన రిప్లై ఇచ్చింది. కొన్ని సన్నివేశాలు చేసేటప్పుడు ముందుగా చెప్పకుండానే అప్పటికప్పుడు తీస్తూ ఉంటారు. అయితే నీకు ఈ విషయం తెలియకపోవచ్చు. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే నటీమణులను అతడు తన బెడ్ రూమ్ లోని బెడ్ ఎక్కే వరకు కూడా వదిలిపెట్టడు.

అలాంటి వాడితో కలిసి ఉన్న ఫోటోలను వీడియోలను పోస్ట్ చేయకు డిలీట్ చేయి అని చెప్పితే వినిపించుకోవా.. నేను ఇంతగా చెప్పినా కూడా వినడం లేదు కాబట్టి అది నీ కర్మ. నేను పెట్టిన శాపనార్థాలకు నువ్వు కచ్చితంగా కర్మ అనుభవిస్తావు అంటూ ప్రతిక రావు మండిపడింది.అయితే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు నిజంగానే బాలీవుడ్ నటుడు హర్షద్ అరోరా వ్యక్తిత్వం అలాంటిదా.. ఆయన ప్రతీక రావుని లైంగికంగా వేధించారా..అందుకే ప్రతిక రావు అలాంటి కామెంట్లు చేసిందా అని విస్తు పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: