హీరోయిన్లకు హీరోలకు మధ్యలో ఏజ్ ఎంత డిఫరెన్స్ ఉన్నా పర్వాలేదు. వారితో సినిమాలు చేస్తూనే ఉంటారు.రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా రెచ్చిపోయి నటిస్తారు. కొంతమంది సీనియర్ హీరోలతో రొమాన్స్ చేసే హీరోయిన్ల వయసు ఆ హీరోల కూతుర్ల వయసు కంటే తక్కువగా ఉంటుంది. అయినా కూడా వారితో రొమాన్స్ చేయడానికి వెనకడుగు వేయరు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ సర్వ సాధారణం.. ఇప్పటికే హీరో హీరోయిన్ల ఏజ్ డిఫరెన్స్ పై సోషల్ మీడియా వేదికగా ఎన్నో ట్రోల్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ రష్మిక కాంబోలో వచ్చిన సికిందర్ మూవీ సమయంలో ఏజ్ డిఫరెన్స్ ట్రోల్స్ వినిపించగా ఆ హీరోయిన్ కి ఆ హీరోయిన్ తండ్రికి లేని ఇబ్బంది మీకెందుకు అంటూ సల్మాన్ ఖాన్ స్పందించారు. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా ఓ హీరోయిన్ కూడా ముసలోడైనా పర్వాలేదు సినిమా చేయడానికి ఏంటి అన్నట్లుగా స్పందించింది.

 ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు నటి మీనాక్షి చౌదరి. రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే తాజాగా నాగచైతన్య సినిమాలో కూడా చాన్స్ కొట్టేసినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.నాగచైతన్య కూడా రీసెంట్ గానే తండేల్ మూవీ తో భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత నాగచైతన్య విరూపాక్ష మూవీ దర్శకుడు అయినటువంటి కార్తీక్ దండుతో ఓ సినిమా చేయబోతున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఫిక్స్ అయినట్టు టాలీవుడ్ సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా ఉండబోతున్నట్టు సమాచారం.

 అయితే ఈ మధ్యనే మామ వెంకటేష్ తో సినిమా చేసిన మీనాక్షి చౌదరి మళ్లీ తాజాగా అల్లుడు నాగచైతన్య సినిమాలో అవకాశం అందుకుందని అర్థమవుతుంది. అయితే ఈ విషయం గురించి కొంతమంది ఇండస్ట్రీ జనాలు అడగగా సినిమా చేయడానికి వయసుతో సంబంధం ఏముంది..మామ అయితే ఏంటి అల్లుడు అయితే ఏంటి..70 ఏళ్ల హీరో తో కూడా రొమాన్స్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్లుగా స్పందించిందట.అయితే మీనాక్షి చౌదరి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో అప్పుడు మామ ఇప్పుడు అల్లుడు మీనాక్షి చౌదరి లక్కు మామూలుగా లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: