ఇప్పటి వరకు ఇండియన్ సినిమా పరిశ్రమలో 1000 కోట్లకి మించిన కలెక్షన్లను సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా వెయ్యి కోట్లకి మించిన గ్రాస్ కలెక్షన్లను సాధించిన ఇండియన్ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

అమీర్ ఖాన్ హీరో గా రూపొందిన దంగల్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 19508 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 1810 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1770 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1290 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

యాష్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1233 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. షారుక్ ఖాన్ హీరో గా నయనతార , దీపికా పదుకొనే హీరోయిన్లుగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1160 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ప్రభాస్ హీరో గా దిశా పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 1061 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. షారుక్ ఖాన్ హీరో గా దీపికా పదుకొనే హీరోయిన్గా రూపొందిన పటాన్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1051 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: