టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఈయన చిరుత మూవీ తో కెరీర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత చరణ్ "మగధీర" సినిమాలో హీరోగా నటించి రెండవ మూవీ తోనే ఇండస్ట్రీ హిట్ను అందుకున్నాడు. ఇకపోతే చరణ్ తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో ఆడి పాడాడు. కాకపోతే చరణ్ కి ఒక హీరోయిన్ మాత్రం అస్సలు కలిసి రాలేదు. ఆమెతో కలిసి నటించిన రెండు సినిమాల ద్వారా కూడా చరణ్ కి భారీ అపజయాలు వచ్చాయి. మరి అంతగా చరణ్ కు కలిసి రాని ఆ బ్యూటీ ఎవరు అనే వివరాలను తెలుసు కుందాం.

చరణ్ కి అస్సలు కలిసి రాని బ్యూటీ లలో కియారా అద్వానీ ఒకరు. మొదటగా చరణ్ , కియార అద్వానీ కాంబినేషన్లో వినయ విధేయ రామ అనే సినిమా వచ్చింది. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈ సినిమాలో చరణ్ , కియారా జంటకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే తాజాగా చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కూడా కియార అద్వానీ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఇలా చరణ్ , కియార కాంబో లో ఇప్పటి వరకు రెండు సినిమాలు రాగా ఆ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: