విజయశాంతి నటించిన తాజా మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో కళ్యాణ్ హీరోగా..విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో పవర్ఫుల్ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. అయితే నిన్న అనగా ఏప్రిల్ 18న విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ మిక్స్ట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ భారీగానే నిర్వహించారు మూవీ మేకర్స్.ఇందులో భాగంగా రీసెంట్ గానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినటువంటి విజయశాంతి సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మీరు ఇప్పుడున్న సీనియర్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ లతో మళ్లీ కలిసి నటిస్తారా అని యాంకర్ ప్రశ్నించగా.. మళ్లీ వాళ్లతో కలిసి నటించే ప్రసక్తే లేదు అంటూ కరాకండిగా చెప్పేసింది.. ఇదే సినిమా లాస్ట్ అని ఇకపై సినిమాలు చేయబోనని, నా జీవితం ప్రజలకు అంకితం చేస్తానని, ఎమ్మెల్సీ ఇవ్వడంతో బాధ్యతలు పెరిగాయని విజయశాంతి చెప్పుకొచ్చింది. 

అలాగే బాలకృష్ణ చిరంజీవిలతో సినిమాలో కలిసి నటించను అని విజయశాంతి కరాకండిగా చెప్పడంతో అప్పట్లో మీడియాలో వైరల్ అయిన ఒక మ్యాటర్ మళ్లీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది.అదేంటంటే విజయశాంతి చిరంజీవి బాలకృష్ణ లతో కలిసి నటించను అనడానికి కారణం అప్పట్లో జరిగిన ఒక వివాదమే అని తెలుస్తుంది. అదేంటంటే..ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరు పడాలి అని తెలంగాణ వాసులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇదే సమయంలో విజయశాంతి అప్పుడున్న హీరోలను మీరు కూడా ఇందుకు సపోర్ట్ చేయొచ్చు కదా అంటే ఎవరు కూడా స్పందించలేదట. దాంతో హీరోలను అసహ్యించుకుంది.అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి ఈ విషయాన్ని చెప్పి షాక్ ఇచ్చింది. కానీ ఆ హీరోల పేర్లు మాత్రం తెలియజేయలేదు. అయితే విజయశాంతి ఆ హీరోల పేర్లు చెప్పకపోయినప్పటికీ చాలామంది నెటిజన్స్ మాత్రం చిరంజీవి బాలకృష్ణ లనే అనుకున్నారు.

 అయితే ఈ హీరోలను విజయశాంతి ప్రత్యేక రాష్ట్రం కోసం స్పందించాలని అడగగా వాళ్లంతా స్పందించడానికి ముందుకు రాలేదట. ఆ కోపంతో విజయశాంతి అప్పటినుండి వారితో మాట్లాడడం కూడా మానేసిందనే వార్తలు వినిపించాయి.అయితే ఈ విషయాన్ని కూడా ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి చెప్పి నేను కొంతమంది హీరోలను ప్రత్యేక రాష్ట్రం కోసం స్పందించమంటే స్పందించలేదు. వాళ్లకు తెలంగాణ ప్రజలు చూపించే ఆదరణ కావాలి తెలంగాణ ప్రజలు లేకపోతే ఆ హీరోలు లేరు. తెలంగాణ ప్రజల వల్లే వారికి అంత ఎక్కువ రెమ్యూనరేషన్లు వస్తున్నాయి. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. వారంతా ముసుగు వేసుకున్న దొంగలు అంటూ మాట్లాడింది. అయితే అప్పట్లో విజయశాంతి చేసిన కామెంట్స్ సీనియర్  హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోల గురించే అని అందరూ అనుకున్నారు. అలా అప్పటినుండి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని విజయశాంతి రీసెంట్ ఇంటర్వ్యూలో వారిద్దరితో కలిసి నటించను అని చెప్పినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: