టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. ఈ బ్యూటీ నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం అందుకోకపోయినా ఈ మూవీ లో అనుష్క తన అందాలతో , నటనలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇకపోతే ఈమె ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తన కెరీర్లో కేవలం ఒకే ఒక్క సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్గా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్టాలిన్ మూవీ లో అనుష్క స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ కి అద్భుతమైన క్రేజ్ వచ్చింది. కానీ అనుష్క మాత్రం ఆ తర్వాత ఏ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేయలేదు. ఇక ఈ బ్యూటీ ని మరో ఇద్దరు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లు ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. కాజల్ అగర్వాల్ , జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ ద్వారా కాజల్ కి అద్భుతమైన క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత కాజల్ ఇప్పటి వరకు ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయలేదు. ఇక సమంత , అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: