
మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ఓదెల 2 సినిమా తాజాగా రిలీజ్ అయ్యింది. ఇక స్వీటీ బ్యూటీ అనుష్క నటించిన
అరుంధతి దగ్గర్నుంచి నిన్నా మొన్న వచ్చి అఖండ వరకూ చాలా సినిమాల రిఫరెన్స్‌లు ఈ సినిమాలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓదెల 2 లోని తిరుపతి పాత్ర అరుంధతిలోని పశుపతి పాత్రని పోలి ఉంటుంది. కొన్ని డైలాగులు కూడా మ్యాచ్ అయ్యాయా ? అని పిస్తుంది. ఇక హిందూత్వం తోపాటు దేవుళ్లు, వాళ్ల మహిమల గురించి చెప్పే సినిమాలు, కథలు, సన్నివేశాలు ఇటీవల ప్రేక్షకులకు బాగా నచ్చుతున్నాయి. ఇక ఓదెల 2 కూడా కరెక్టుగా పై సినిమాల కథలను గుర్తుకు తెస్తుంటుంది.
ఇక సినిమా లో పంచాక్షరి మంత్రం గురించి ఓ ముస్లిం ఫకీరు చెప్పడం బాగుందంటున్నారు. సాక్షాత్తూ పరమశివుడే నేరుగా దిగి వచ్చి ఓ దుష్ట శక్తిని అంతరించడం విజువల్‌గా మంచి మూమెంట్ అని అయితే శివుడే దిగి రావాలని అంటే తిరుపతి పాత్రని ఇంకా బీభత్సంగా చూపించాలని .. అతడిని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక మిల్కీబ్యూటీ తమన్నాని ఈ తరహా పాత్రలో చూడడం కొత్తగా ఉందని.. ఆమె కూడా హుందాగా నటించింది. తమన్నా తన పాత్రకు కట్టుబడి నటించింది. హెబ్బా పటేల్ ది జస్ట్ గెస్ట్ రోల్. ఇక రు. 20 కోట్ల తో తీసిన ఈ సినిమా విజువల్స్ పరంగా చూస్తే ఇంకా కాస్ట్ లీ గా అనిపించింది.
దర్శకుడు సంపత్‌నంది ఈ సినిమాకు కర్త కర్మ క్రియ. ఓదెల ఫ్రాంచైజీని ఆయన బాగా పట్టుకొన్నాడు.. కొన్ని సీన్లు థియేటర్లో చూస్తుంటే గూప్ బంప్స్ మోత మోగిపోతుంటుంది. ఇక అరుంధతి సినిమా 2009లో వస్తే ఓదెల 2 అరుంధతి 2025 అనుకోవాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.