టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ రిజెక్ట్ చేసిన మూడు సినిమాలు భారీ ఫ్లాప్ లను ఎదుర్కొన్నాయి. ఆ మూడు సినిమాల్లో ఇద్దరు నటీమణులు హీరోయిన్లుగా నటించగా ... వాటి ద్వారా ఆ నటీమణులకు భారీ ఫ్లాప్స్ వచ్చాయి. ఇంతకు రష్మిక రిజక్ట్ చేసిన ఆ మూవీలు ఏవి ..? అందులో నటించి అపజయాలను అందుకున్న ఆ బ్యూటీలు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి "ఆచార్య" అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో మొదట రామ్ చరణ్ కి జోడిగా పూజా హెగ్డే స్థానంలో రష్మికను మేకర్స్ అనుకున్నారట. కానీ ఆమె ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో పూజా హెగ్డే ను ఆ మూవీ లో హీరోయిన్గా తీసుకున్నారట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. అలాగే తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో మొదట రష్మికను హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఆమె ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత పూజా హెగ్డేను ఆ మూవీలో హీరోయిన్గా తీసుకున్నారట. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. నితిన్ హీరోగా రూపొందిన రాబిన్ హుడ్ మూవీ లో మొదట రష్మిక ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆమె ఆ సినిమా నుండి తప్పుకోవడంతో శ్రీ లీల ను ఆ మూవీ లో హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. అలా రష్మిక రిజెక్ట్ చేసిన మూడు మూవీల ద్వారా పూజా హెగ్డే , శ్రీ లీల ఇద్దరికి కూడా భారీ అపజయాలు అందినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: