తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది లెజెండ్రి నటీనటులు ఉన్నారు.ముఖ్యంగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకుల గుండెలలో చెరగని ముద్ర సంపాదించకుండా నటీనటుల వారసులు ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. చాలావరకు కమెడియన్స్ కామెడీ రోల్స్ లోనే కనిపిస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో సపరేట్ కామెడీ సెట్ చేసిన నటీనటులలో నటుడు పద్మనాభం కూడా ఒకరు చిన్నతనంలోనే నాటకాల పట్ల ఆసక్తి ఉండడంతో రంగస్థలం నటుడుగా తన కెరీయర్ని ప్రారంభించారు. అలా 1950లో షావుకారు అనే సినిమాతో చిన్న పాత్రలో నటించి ఎంట్రీ ఇచ్చిన పద్మనాభంకు పాతాళ భైరవి, గుండమ్మ కథ, మాయాబజార్ వంటి చిత్రాలలో కూడా నటించడంతో క్రేజ్ పెరిగిపోయింది.


తనదైన కామిడీ టైమింగ్ తో ఆకట్టుకున్న పద్మనాభం సహజమైన నటనతో కూడా ప్రేక్షకులను అలరించారు. రవితేజ నటించిన భద్ర, ప్రభాస్  చక్రం తదితర చిత్రాలలో కూడా అద్భుతమైన నటనతో మెర్పించారు. అయితే 2010లో ఈయన చెన్నైలో గుండెపోటుతో మరణించారు. లెజెండ్రీ కమెడియన్ పద్మనాభం కొడుకు కూడా తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్గా రాణిస్తున్నారు అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇక ఆ నటుడు ఎవరో కాదు తిరుపతి ప్రకాష్.


కమెడియన్ పలు చిత్రాలలో కమెడియన్ గా కనిపించడమే కాకుండా జబర్దస్త్ వంటి ప్రోగ్రాంలో కూడా కనిపించడం జరిగింది. కమెడియన్ పద్మనాభం కు తిరుపతి ప్రకాష్ పెదనాన్న వరస అవుతారట. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తిరుపతి ప్రకాష్ ఈయన గురించి పలు విషయాలు తెలిపారు. తన పెదనాన్న సపోర్టు వల్లే తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కమెడియన్ ఆలీ గారు తనకి సపోర్ట్ చేసేవారని తెలియజేశారు. అయితే అప్పట్లో ఎన్నో చిత్రాలలో నటించిన తిరుపతి ప్రకాష్ ఈ మధ్యకాలంలో మాత్రం పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం తన వృత్తిని మాత్రమే కొనసాగిస్తే ఉన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: