
ఇపుడు కొత్తగా సుజీత్ - నాని కాంబో వినబడుతోంది. అయితే దీనిపై హీరో నాని తాజాగా స్పందించారు. నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అయితే సుజీత్ తో సినిమా ఎప్పుడనేదానిపై ఇప్పుడు నాని తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నాని నటించిన హిట్-3 మూవీ కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో నాని మాట్లాడుతూ... "సుజీత్ తో సినిమా కచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పటికి నేను దానిని కన్ఫర్మ్ చేస్తున్నాను. ప్యారడైజ్ సినిమా పూర్తైన తరువాత సుజీత్ తో వచ్చే ఏడాది మా కాంబో ఉంటుంది. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అది వేరే లెవల్ లో ఉంటుంది. ప్రేక్షకులు ఎంతైనా ఊహించుకోవచ్చు. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాం. దానికి చాలా పెద్ద బడ్జెట్ ఉంటుంది!" అంటూ క్లారిటీ ఇచ్చాడు.
కాగా నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హిట్ - 3 సినిమా మే 1న థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. దీని తర్వాత ప్యారడైజ్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. ఆ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్యారడైజ్ టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కాబోతోంది.