సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ శాతం స్టార్ హీరోలు ఒకే సినిమాపై కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటారు. ఒక సినిమా మొత్తం పూర్తి అయ్యాక ఆ సినిమా రిజల్ట్ ను బట్టి ఆ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అనే దాన్ని నిర్ణయించుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ జరిగే విషయంలో హీరోలు నటించిన సినిమాలు సంవత్సరానికి ఒకటి , రెండు అంతకన్నా ఎక్కువ విడుదల కావు. అదే హీరోయిన్లు మాత్రం క్రేజ్ ఉన్న సమయంలో వరస పెట్టి సినిమాలలో నటిస్తూ ఉంటారు. దానితో కొంత మంది హీరోయిన్లు నటించిన సినిమాలు వరుసగా రిలీజ్ అవుతాయి.

కొంత మంది హీరోయిన్లు ఒక్క సంవత్సరంలోనే ఐదు , ఆరు సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు కూడా వస్తూ ఉంటారు. కానీ ఓ ఇద్దరూ హీరోయిన్లు మాత్రం అద్భుతమైన క్రేజ్ ఉన్న కూడా వరుస పెట్టి సినిమాల్లో నటించడం లేదు. ఆ బ్యూటీలు ఎవరు అనుకుంటున్నారా ..? ఆ ఇద్దరు మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులు అయినటువంటి అనుష్క , సమంత. వీరిద్దరూ చాలా కాలం క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాక చాలా తక్కువ కాలంలోనే ఈ వీరు స్టార్ హీరోయిన్ల స్టేటస్ కి చేరుకున్నారు. స్టార్ హీరోయిన్స్ స్టేటస్ కి చేరుకున్న తర్వాత కూడా వీరు అదే రేంజ్ లో అనేక సంవత్సరాలు కెరీర్ను కొనసాగించారు. వీరు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి కూడా వీరిద్దరికి అద్భుతమైన గుర్తింపు ఉంది.

కానీ వీరిద్దరూ మాత్రం ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వరస పెట్టి సినిమాల్లో నటించడం లేదు. ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటూ కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. దానితో వీరు సంవత్సరానికి ఒక్కో సినిమాను కూడా ప్రేక్షకుల ముందు కొన్ని సందర్భాలలో తీసుకురాలేకపోతున్నారు. అద్భుతమైన క్రేజ్ ఉన్న కూడా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అత్యంత స్లో గా మూవీలను సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: