
ఇప్పటికే హిట్ 3 ట్రైలర్ తర్వాత సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి .. ఇక దీని తర్వాత రీసెంట్ గానే వచ్చిన రెట్రో ట్రైలర్ కూడా మంచి ఎంగేజింగ్ గా ఉండటంతో కోలీవుడ్ సహ టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు పెరిగాయి .. సో హిట్ 3 కి మాత్రం మన తెలుగులో కొంచెం టాప్ ఇవ్వటం గ్యారంటీ అని కూడా అంటున్నారు .. ఈ రెండు సినిమాలు కూడా మే 1న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి .. ఇక మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది .. ప్రేక్షకులను ఏ సినిమా బాగా మెప్పింస్తుంది అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే . అయితే సూర్య మాత్రం రెట్రో సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు .. గత కొన్ని సంవత్సరాలుగా సూర్యా నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను అసలు ఏ విధంగానూ మెప్పించలేకపోతున్నాయి ..
ఎన్నో అంచనాలతో తీసిన కంగువా మూవీ కూడా పాన్ ఇండియ స్థాయిలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది . ఇక మరి ఇప్పుడు రెట్రో సినిమాతో కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు . అలాగే నాని కూడా వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు . ఇప్పటికే హిట్ 1న్ , హిట్ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి .. అలాగే నాని హీరో గానే కాకుండా హిట్ 3 సినిమాని నిర్మిస్తూ నటిస్తున్నాడు .. ఇప్పటికే నాని ప్రొడ్యూస్ చేసిన సినిమాలు బాక్సాఫీ దగ్గర ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తున్నాయి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. ఇలాంటి ఫుల్ ఫామ్ లో నాని హిట్ 3 సినిమాతో కూడా మరో సక్సెస్ గ్యారంటీ అని అంటున్నాడు .. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి ..