బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కేరీర్‌ లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌ ఏంటో తెలుసా ? ఈ లిస్టులో చాలా సినిమాలు ఉన్నాయి .. కానీ వాటన్నిటి కంటే పెద్ద డిజాస్టర్ మాత్రం 2008 లో వచ్చిన యువరాజ్ అనే మూవీ .. సుభాష్ ఘ‌య్ లాంటి దర్శ‌కుడు కత్రినా లాంటి స్టార్ బ్యూటీ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పటి కీ ఈ సినిమా ను ఎవరు గాట్టెక్కించలేకపోయారు .. ఇక మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు యువరాజ్ సినిమా ను పక్కకు నెట్టే సినిమాను చేశాడు సల్మాన్ ఖాన్ .. అదే సికిందర్ ..


మురగదాస్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్ ను 10 సంవత్సరాలు వెనుకు తోసెసింది .. స్వయంగా ఆయన అభిమానులు ఈ సినిమా చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .. అలా సల్మాన్ కెరీర్ లో రెండు అతిపెద్ద డిజాస్టర్ గా సికిందర్ మూవీ నిలిచింది .  ఇలాంటి సినిమాల్లో హీరోయిన్గా నటించిన రష్మిక .. దీంతో సహజంగానే ఆమెపై ప్లాప్‌ హీరోయిన్ అనే ముద్ర కూడా వచ్చేసింది .  కానీ ఈ విషయంలో రష్మిక కొంత అదృష్టవంతురాలు .. సికిందర్ ప్లాప్‌ ప్రభావం ముందుగా మురగదాస్ పై ఆ తర్వాత సల్మాన్ ఖాన్ పై పడింది ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఎవ్వరు రష్మికను తప్పు పట్టకపోవటం ఇక్కడ మరో విశేషం ..


అలాగే ఆమె అదృష్టమనే చెప్పాలి .  అయితే ఈ అదృష్టం ఆమెకు కొన్నాళ్లు మాత్రమే .. ఈ గ్యాప్ లో ఆమె కచ్చితంగా హిట్‌ కొట్టాలి .. లేదంటే ఐరన్ లెగ్ అనే ట్యాగ్  ఇవ్వడానికి ఏమాత్రం మొహమాట‌పడరు ప్రేక్షకులు .. చావా సినిమా సక్సెస్ రష్మికను ఇంకా బాలీవుడ్లో కాపాడుతూ వస్తుంది .. అలానే ఇటు సౌత్లో ఆమె నటించిన కుబేర సినిమా రిలీజ్ కు రెడీ అయింది .. ఇది హిట్ అయితే కొన్నాళ్లు ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు .. రష్మిక కెరియర్లో రాబోయే సినిమాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: