
గోదావరి జిల్లాల్లో అప్పుడప్పుడు క్రాప్ హాలీడే ఉన్నట్టు.. చేపల వేటకు హాలీడే ఉన్నట్టు ఇప్పుడు టాలీవుడ్‌కు కూడా హాలీడే తప్పేలా లేదు. టాలీవుడ్ థియేటర్లకు హాలీడే వచ్చే ప్రమాదం ఉంది. ఫిబ్రవరి నుంచి టాలీవుడ్ థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎంత పెద్ద హిట్ అయినా ఒక్క వారానికే జనాలు రావడం లేదు. తండేల్ అంత పెద్ద హిట్ అయినా చాలా ఏరియాల్లో ఫుట్ పాల్స్ రాలేదు. హిట్ టాక్ వచ్చినా.. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా జనాలు రావడం లేదు. థియేటర్ల నిర్వహణ, కరెంటు ఖర్చులు, జీత భత్యాలు కూడా రావడం లేదు.
కలెక్షన్లు ఉంటే షేరింగ్ సిస్టమ్ బెటర్. . కానీ పది మంది వస్తే. వాళ్లకు షో వేస్తే కరెంటు, జీత భత్యాలు, ఏసీ జనరేటర్ ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఇక టిక్కెట్ల రేట్లు పెంచడం కూడా జనాలు థియేటర్ల వైపు చూడడం లేదు. ఇక సోషల్ మీడియా ప్రచారంతో సినిమా మినిట్ టు మినిట్ తెలిసిపోతోంది.. అందుకే మరీ సూపర్ టాక్ వస్తే తప్పా థియేటర్లకు రావడం లేదు. లేకపోతే ఓటీటీ లేదా ఐబొమ్మకు వెళ్లిపోతున్నారు. ఏదేమైనా ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఈ సమ్మర్ లేదా మరో ఐదారు నెలల్లో టాలీవుడ్ థియేటర్లకు హాలీడే ఇస్తారా ? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.