నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్ కాంబినేషన్లో వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా నిన్నటి రోజున భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. అయితే మొదటి రోజు కొంతమేరకు పాజిటివ్ టాక్ రాబట్టినప్పటికీ.. స్టోరీ పరంగా పెద్దగా అనిపించలేదని కానీ విజయశాంతి, కళ్యాణ్ రామ్ నటన మాత్రం అద్భుతంగా ఉన్నాయని పలువురు నెటిజెన్స్ తెలియజేశారు. అయితే ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే మాత్రం ఎంత మేరకు రాబట్టగలిగిందనే విషయం గురించి సోషల్ మీడియాలో చిత్ర బృందం ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది వాటి గురించి చూద్దాం.


బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్ వంటి వారు కూడా ఇందులో నటించారు. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తన మొదటి సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించారు. మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే రూ.5.15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది అన్నట్లుగా చిత్ర బృందం అఫీషియల్ పోస్టర్తో తెలిపారు. మొదటిరోజు ఈ స్థాయిలో రాబట్టడంతో కళ్యాణ్ రామ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా నిలిచిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా యూఎస్ఏ,ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలలో కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని ఇదంతా కూడా సినిమా కంటెంట్ పవర్ఫుల్ పర్ఫామెన్స్ చేయడం వల్లే సాధ్యమైందని రెండు వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ చిత్రంలో విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి కొడుకుల పాత్రలో ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా పండించారని విజయశాంతి మరొకసారి తన నటనతో ప్రాణం పోసిందనే విధంగా తెలుపుతున్నారు. క్లైమాక్స్ లోని  సన్నివేశాలు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయని.. ట్విస్టులతో సాగే కథాంశం వల్లే ఈ సినిమా థియేటర్లో సక్సెస్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి రెండవ రోజు ఫ్రీ బుకింగ్స్ లో కూడా మంచి ట్రెండు కొనసాగేలా కనిపిస్తోంది. మొత్తానికి ఫస్ట్ డే కలెక్షన్స్ తో అదరగొట్టేశారు కళ్యాణ్ రామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: