
అంతేకాదు ఆ తర్వాత నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని అంతా అనుకున్నారు. అది కూడా క్యాన్సిల్ అంటూ టాక్ బయటికి వచ్చేసింది . ఆ తర్వాత చాలామంది స్టార్ట్ డైరెక్టర్ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ ఉండబోతుంది అని అంతా మాట్లాడుకున్నారు . అయితే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాకపోవడంతో జనాలు ఇది కూడా ఫేక్ అంటూ కొట్టి పడేశారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ మాత్రం బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీ మోక్షజ్ఞ డెబ్యూ ఫిలిం కి సంబంధించిన ఫ్రెష్ అప్డేట్ ఇవ్వబోతున్నారట.
అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ - బాలయ్య కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారట . అయితే డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని నా..? లేకపోతే వెంకీ అట్లూరినా..? అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు . సోషల్ మీడియాలో మాత్రం ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. డైరెక్టర్ ఎవరైనా సరే కొడుకు కోసం కొడుకు హిట్ కొట్టాలి అన్న ఆలోచనలో బాలకృష్ణనే స్వయంగా రంగంలోకి దిగడం నందమూరి అభిమానులకి బాగా నచ్చేసింది . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోతుంది..!