
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరో గా ఇప్పుడు చేస్తున్న భారీ సినిమాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ సినిమా కూడా ఒకటి .. ఇక ఎన్టీఆర్ కెరియర్ లోనే 31 వ సినిమా గా రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు .. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదలు పెట్టాడు .. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ లేని సన్నివేశాలతో ప్రశాంత్ షూటింగ్ చేయగా .. మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ లో అడుగు పెట్టబోతున్నాడు .. ఇక మరి గతం లో సలార్ తరహా లోనే షూటింగ్ మొదలు పెట్టి అతి తక్కువ సమయం లోనే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నట్టు ఇప్పుడు కూడా ఎన్టీఆర్ , నీల్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రేక్షకుల కు అందించబోతున్నట్లు గా తెలుస్తుంది .
ఇక రాబోయే మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భం గా ఫస్ట్ లుక్ సహా టైటిల్ కూడా విడుదల చేసే ఆలోచన లో చిత్ర యూనిట్ ఉంటుంద ని తెలుస్తుంది .. అలాగే దీని పై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట . అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ వార్ 2 మూవీ నుంచి కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు కనుకగా అభిమానులకు ఓ స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఉండిపోతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి . ఇలా ఎన్టీఆర్ బర్త్డే పురస్కరించుకుని అభిమానులకు ఈసారి ఊహించని సర్ప్రైజులు కాయంగా కనిపిస్తున్నాయి .. మరి ఈ రెండు సినిమాల తో ఎన్టీఆర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి ..