మరోసారి అదే విమర్శ .. అదే రీమార్క్ .. వరుసగా రెండోసారి మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక‌నాధ్‌ పై విమర్శలు వస్తున్నాయి .. బ్యాక్గ్రౌండస్కోర్ లో ఇతను తన మార్క్ చూపిస్తున్నాడు .. కానీ పాటలు విషయం లో మాత్రం పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు .. మొన్న ఓదెల 2 రిలీజ్ అయింది .. ఈ సినిమా స్క్రీన్ ప్లే డైలాగ్స్ లో ఎన్నో దోషాలు కనిపించకుండా అజనీష్ లోక‌నాధ్‌ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కొంత మ్యాజిక్ చేశాడు .. అయితే పాటల విషయం లో మాత్రం ఫెయిల్ అయ్యాడు .. ఓదెల 2 లాంటి సినిమా లో పాటలు కూడా బలంగా ఉండాలి ..


కానీ సినిమా లో ఆ లోటు గట్టి గా కనిపించింది ..  ఇక తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అర్జున్ సన్నఫ్‌ వైజయంతి సినిమా కూడా రిలీజ్ అయింది .  దీనికి కూడా అజనీష్ లోక‌నాధ్‌ మ్యూజిక్ అందించాడు .. ఇక్కడ కూడా అదే మిస్టేక్ మరోసారి రిపీట్ చేశాడు .. ఈ సినిమాకు అజనీష్ లోక‌నాధ్‌ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలెట్గా నిలిచింది కానీ పాటలు సినిమాను తేలిపోయేలా చేసాయి .. అర్జున్ సన్నఫ్‌ వైజయంతి అనేది పూర్తి పక్క కమర్షియల్ ఫార్మాట్లో చేసిన మూవీ .. ఇలాంటి మూవీలో పాటలు కచ్చితంగా బాగుండాలి కనీసం ఒక్క పాటైనా క్లిక్ అయ్యేలా ఉండాలి.


ఇక మరి ఏం నమ్మకంతో అజనీష్ లోక‌నాధ్ ను మేకర్స్ తీసుకున్నారు వాళ్ళకే తెలియాలి .. ఇలా బ్యాక్ టు బ్యాక్ వచ్చిన రెండు సినిమాల తో ఒకే తరహా విమార్శ‌లు తెచ్చుకుంటున్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ .. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే తన  డొమైన్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు .. మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలంటే బిజిఎం మాత్రమే సరిపోదు .. ఆకట్టుకునే పాటలు కూడా ఇవ్వాలి .  ఇక మరి రాబోయే సినిమాల్లో ఈ లోపాన్ని అజనీష్ లోక‌నాధ్‌ వీలైనంత త్వరగా అధిగమించి మంచి పాటలు ఇవ్వాలని ఆశిద్దాం .

మరింత సమాచారం తెలుసుకోండి: