ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఎక్కువగా మాట్లాడుకునేది మహేష్ - రాజమౌళి సినిమా గురించే.  టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమాలో నటిస్తున్నాడు అని తెలియగానే ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. రాజమౌళి అభిమానులు స్టాన్ అయిపోయారు.  ఎప్పుడు ఫ్యామిలీ వెకేషన్స్ తో ఎంజాయ్ చేసే మహేష్ బాబు.. స్ట్రిక్ట్ గా ఉండే రాజమౌళికి కాల్ షీట్స్ ఇచ్చాడా ..? అంటూ ఆశ్చర్యపోయారు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి - మహేష్ బాబు సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి .


రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్నారు చిత్ర బృందం.  త్వరలోనే ఆఫ్రికా అడవులకు వెళ్లబోతున్నారు మూవీ టీం. ప్రజెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా రాజమౌళి సినిమా షూటింగ్ కి బ్రేక్ చెప్పినట్లు తెలుస్తుంది . ఈ టైం గ్యాప్ లోనే మహేష్ బాబు వెకేషన్ కి వెళ్ళిపోయారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుంది . ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ లీడ్ పాత్ర కోసం మరొక సెన్సేషనల్ బ్యూటీని చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



ఆమె మరెవరో కాదు హీరోయిన్ నయనతార . ఎస్ నయనతార పేరు ఇప్పుడు సౌత్ ఇండియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే . మొదటి నుంచి నయనతార అంటే ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చదు . మిగతా అందరికీ నయనతార అంటే బాగా నచ్చుతుంది . మరీ ముఖ్యంగా ఫిమేల్  ఓరియంటెడ్ పాత్రలను ఇష్టంగా చేస్తుంది. ఇప్పుడు నయనతారకు ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో మెరిసే ఛాన్స్ ఇచ్చారట . ప్రజెంట్ ఆమెకు అవకాశాలు సరిగ్గా రావడం లేదు . ఈ క్రమంలోనే ఆమె ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఈ ప్రాజెక్టును ఓకే చేసిందట . రాజమౌళి - మహేష్ సినిమాలో నయనతార లీడ్ పాత్రలో కనిపించబోతుంది అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: