బలగం సినిమాతో  డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నాడు కమీడియన్ వేణు .. జబర్దస్త్ లో తన కామెడీతో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించాడు.  దర్శకుడుగా బలగం సినిమాతో మాత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఏడిపించేసాడు .. ఈ సినిమా సూపర్ హిట్ తో వేణు పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా మారుమోగిపోయింది .. టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించాడు .. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్లు అందుకుని నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది ..


ఇక ఈ సినిమా హిట్ తరవాత వేణు ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .. అదే ఎల్లమ్మ .. ముందుగా నాచురల్ స్టార్ నాని  హీరోగా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి .. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నుంచి నాని తప్పుకున్నాడు .. ఆ తర్వాత ఈ స్టోరీ అటూ ఇటూ తిరిగి యంగ్ హీరో నితిన్ వద్దకు చేరింది .. వేణు , నితిన్ కి ఈ స్టోరీ చెప్పగా సినిమా చేయడానికి ఓకే చెప్పాడు .. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నాడు .. అలాగే అతుల్ సంగీతం అందిస్తున్నాడు .. ఒక గ్రామీణ రూరల్ పల్లెటూరి డ్రామాగా రాబోతున్న ఈ సినిమా లో నితిన్ ను మునుపెన్నడూ ఎప్పుడూ చూడని క్యారెక్టర్ లో చూపించబోతున్నట్టు తెలుస్తుంది ..


 ఈ సినిమాలో నితిన్ కు జంటగా హీరోయిన్గా ముందుగా సాయి పల్లవిని సెలెక్ట్ చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది .. కానీ ఇప్పుడు తాజాగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది .. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్ లో మరొక స్టార్ హీరోయిన్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది .. ఇంతకీ ఆమె మరి ఎవరో కాదు .. కీర్తి సురేష్ ఈ మూవీలో హీరోయిన్గా ఈమెను ఓకే చేసినట్లు తెలుస్తుంది .. సాయి పల్లవి నో చెప్పడం తో కీర్తి సురేష్ ను సంప్రదించక ఆమె సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది .. ఇక దీంతో నితిన్ కు జండగా కీర్తి సురేష్ ఎల్లమ్మ సినిమాలో నటించబోతుంది .  అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన త్వరలోనే ఇవ్వనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: