
త్రిష తోటి హీరోయిన్స్ అందరూ కూడా వివాహ బంధంలో అడుగుపెట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటే త్రిష మాత్రం పెళ్లి అంటే దూరం అంటుంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష తన పెళ్లి పైన స్పందించింది. వివాహ బంధం పైన మీ అభిప్రాయం ఏంటి అంటూ యాంకర్ ప్రశ్నించగా? వాస్తవానికి తనకు వివాహం పైన నమ్మకం లేదని తెలియజేసింది.. తన జీవితంలో పెళ్లి అయినా ఓకే..కాకపోయినా పర్వాలేదు అంటూ తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీన్నిబట్టి చూస్తూ ఉంటే త్రిష పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదేమో అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
కానీ గడిచిన పాత ఇంటర్వ్యూలో మాత్రం పెళ్లి ఎందుకు చేసుకోలేదని విషయం పైన తన దగ్గర ఎలాంటి జవాబు లేదని తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటానని తెలిపింది. తనను వివాహం చేసుకునే వ్యక్తి తనకు జీవితాంతం తోడుంటాడని నమ్మకం కలగాలి అలాంటి వ్యక్తినే వివాహం చేసుకుంటానని తెలిపింది. వివాహం చేసుకొని విడాకులు తీసుకోవడం అంటే తనకి అసలు నచ్చదని.. ప్రస్తుతం చాలామంది వివాహం చేసుకొని అసంతృప్తితో జీవిస్తున్నారని అలాంటి పరిస్థితి నాకు వద్దు అంటూ తెలియజేసింది. మరి త్రిష పెళ్లి పైన ఇలా రెండు మాటలు మాట్లాడుతూ అభిమానులను కన్ఫ్యూజన్లో పడేస్తోంది.