తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. తమిళంలో అనేక సినిమాలలో నటించి ఈ హీరో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్నాడు. అజిత్ తెలంగాణ వాసి. ప్రేమ పుస్తకం సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా అనంతరం ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన అజిత్ ఇప్పటికీ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ తన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాగా, అజిత్ కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. 

తనకు సమయం దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా అతనికి సింగిల్ గా ట్రావెలింగ్ చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ క్రమంలోనే అజిత్ కుమార్ కారు మరోసారి ప్రమాదానికి గురైంది. గతంలోనూ అజిత్ ట్రావెలింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా అజిత్ కుమార్ కారు బెల్జియం లోని సర్క్యూట్ డిస్పా - ఫ్రాంకోర్చాంప్స్ రేసులో అజిత్ నడిపిన కారు అదుపుతప్పి ట్రాక్ పైనుంచి పక్కకు దూసుకు వెళ్ళింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది.


కాగా ఈ ప్రమాదంలో అజిత్ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఆయన అభిమానులు అజిత్ కి ఎలాంటి అపాయం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా, అజిత్ ఇటీవలే నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చేశారు.  రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఈ సినిమా రూ. 200 కోట్లకు పైనే కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం అజిత్ చేతినిండా వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: