పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో కృష్ణంరాజు వారసుడిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు. ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్నారు. ఆ సినిమా అనంతరం ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులను దోచేశారు. ప్రభాస్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. 


రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ సినిమా అనంతరం బాహుబలి-2 సినిమాను కూడా తీసి మరో బంపర్ హిట్ విజయాన్ని ప్రభాస్ తన ఖాతాలో వేసుకున్నాడు. బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ చేతిలో దాదాపు మూడు సినిమాలకు పైనే ఆఫర్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలలో నటిస్తూ బిజీ హీరోగా తన సమయాన్ని గడుపుతున్నారు.

 
ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం తన షూటింగ్ కు కొంత కాలం పాటు విరామం తీసుకోవాలని నిశ్చయించుకున్నారట. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ప్రభాస్ కాస్త గ్యాప్ తీసుకుని తన డ్రీమ్ డెస్టినేషన్ అయిన ఇటలీకి వెళ్లాలని అనుకుంటున్నారట. ఇటలీలోని ఓ పల్లెటూరుకు ప్రభాస్ వెళ్లినట్టుగా తెలు స్తోంది. దాదాపు ఒక నెలపాటు ప్రభాస్ అక్కడే విశ్రాంతి తీసుకొనున్నట్టుగా సమాచారం అందుతుంది. తన డెస్టినేషన్ పూర్తయిన వెంటనే ప్రభాస్ మళ్లీ తిరిగి షూటింగ్ లలో పాల్గొనాలని ప్లాన్ లో ఉన్నారట. ప్రస్తుతం ఈ హీరోకి సంబంధించి ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: