టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోలు మాత్రమే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమై మంచి గుర్తింపు అందుకుంటారు. అలాంటి వారిలో నటుడు నాని ఒకరు. ఈ హీరో ఎన్నో సినిమాలలో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా నానికి యూత్ లో విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. నాని తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు.



ఇక నేచురల్ స్టార్ నాని అనే ట్యాగ్ ను సైతం సొంతం చేసుకున్నాడు. ఇక నాని కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగాను మారారు. నాని సొంతంగా తన నిర్మాణ సంస్థలో అనేక సినిమాలకు నిర్మాణం వహించారు. ఇక నాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు, తన సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే నాని తన తదుపరి సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వెల్లడించారు. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది పారడైజ్' సినిమాలో నటిస్తున్నారు.


ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే డైరెక్టర్ సుజీత్ తో కచ్చితంగా సినిమాను చేస్తానని చెప్పారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథ కూడా ఓకే అయినట్టుగా హీరో నాని అనౌన్స్ చేశారు. సుజిత్ తో చేసే సినిమా భారీ బడ్జెట్ ప్రాజెక్టు అని, వేరే లెవెల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని నాని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రస్తుతం నాని నటించిన హిట్-3 సినిమా మే 1వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం నాని అభిమానులు ఎప్పటినుంచో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని, భారీగా కలెక్షన్లను రాబడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాని చేతిలో మూడు నాలుగు సినిమా ప్రాజెక్టులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: