స్నేహ: భర్త ఉండగానే ప్రియుడికి ఫోన్ కాల్?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో ఒకప్పటి హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకున్న వారిలో నటి స్నేహ ఒక్కరు. ఈ చిన్నది చిత్ర పరిశ్రమకు పరిచయమైన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆ సినిమా అనంతరం తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. తన నటన అందచందాలతో ఈ బ్యూటీ ప్రేక్షకులను మైమరిపించింది. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం సినిమాలలోనూ నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా రాణించింది. 


స్నేహ సినిమాల లో సమయంలో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో జతకట్టి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు అందుకుంది. అయితే ఇప్పుడు స్నేహ హీరోయిన్ గా కాకుండా కేవలం అక్క, వదిన వంటి పాత్రలను మాత్రమే పోషిస్తూ మంచి గుర్తింపు అందుకుంటుంది. ఇక హీరోయిన్  స్నేహ సినిమాలలో రాణిస్తున్న సమయంలోనే ప్రముఖ నటుడు ప్రసన్నను 2012లో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఈ బ్యూటీ ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా... స్నేహ కు సంబంధించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. 

హీరోయిన్  స్నేహ సినిమాలలో నటిస్తున్న సమయంలో ఓ తెలుగు హీరోతో సీక్రెట్ గా ప్రేమాయణం కొనసాగించిందట. ఆ హీరోను వివాహం చేసుకోవాలని అనుకున్నప్పటికీ సాధ్యం కాలేదట. ఆ హీరో కుటుంబ సభ్యులు హీరోయిన్ స్నేహను కోడలిగా ఒప్పుకోలేకపోయారట. అనంతరం ఆ హీరో మరో అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే స్నేహ ఆ హీరోకు తరచూ ఫోన్ కాల్స్ చేసి మాట్లాడుతుందట. ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు బయటకు రానప్పటికీ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంది. ఈ విషయం పైన ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: