టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంటారు. అలాంటి హీరోయిన్లలో నటి సమంత ఒకరు. ఈ చిన్నది ఏమాయ చేసావే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న సమంత సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ ను ముందుకు కొనసాగించింది. ఏమాయ చేసావే సినిమా అనంతరం సమంతకు తెలుగులో అవకాశాలు ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు క్యూ కట్టారు.


ఈ చిన్నది తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను దక్కించుకుంది. ఇక సమంత తన కెరీర్ మంచి పీక్స్ లో కొనసాగుతున్న సమయంలోనే నటుడు నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. కేవలం నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే కలిసి ఉన్న సమంత, నాగ చైతన్య ఏవో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం సమంత వరుసగా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది.


నాగ చైతన్య మాత్రం ఓ వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నటి శోభితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సమంత కూడా రెండో వివాహం చేసుకోబోతుందని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. కానీ సమంత ఇప్పటివరకు ఈ విషయంపైన స్పందించలేదు. కాగా, సమంత తాజాగా తిరుమలకు వెళ్లారు. తిరుమలలో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తున్నారట.


దీంతో సమంత తన రెండో పెళ్లి కోసమే తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు చేస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ సమంతకు సంబంధించి ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. సమంత రెండో పెళ్లి చేసుకోవాలని తన అభిమానుల సైతం కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: