టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది డైరెక్టర్ లు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల పిచ్చిలో పడి స్పై సినిమాలను పక్కన పడేస్తున్నారు. ఒకవేళ వచ్చిన కూడా ఏదో ఆడపాతడపగా కనిపిస్తాయి అంతే. ముఖ్యంగా ఒకప్పుడు స్పై సినిమాలు అంటే చాలా హిట్ అయ్యేవి.. వాటికో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేది. ఇప్పుడు మాత్రం అసలు అలాంటి సినిమాలు తీయడమే గగనం అయిపోయింది. ఒకవేళ తీసిన కూడా అవి అంతగా హిట్ కొట్టడం లేదు.
 
అయితే స్పై సినిమా అంటే మనకి మొదట గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ.. ఈయన స్పై పాత్రలకు అప్పట్లో చాలా బాగా సెట్ అయ్యేవారు. ఆయన నటించినప్పుడు స్పై అంటే చాలా సీరియస్ గా ఉండే పాత్ర..  అలాగే ఆ సినిమాలు కూడా మంచి హిట్ అందుకునేవి. ఆతర్వాత అలాంటి పాత్రలలో విక్టరీ వెంకటేష్, మెగా స్టార్ చిరంజీవి నటించారు. వీరు స్పైగా నటించిన సినిమాలలో కాస్త కామెడీ టచ్ అయ్యేది. అయినప్పటికీ ఆ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇక మొన్న ఈ మధ్య అడివి శేష్ నటించిన గూఢచారి, నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలు వావ్ అనిపించాయి.


కానీ వీటి తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం సక్సెస్ కాలేకపోయాయి. అంతెందుకు ఇటీవలే విడుదలైన సిద్ధూ జొన్నలగడ్డ సినిమా జాక్ కూడా ఫ్లాప్ అయ్యింది. అలాగే అఖిల నటించిన ఏజెంట్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక నిఖిల్ నటించిన స్పై, కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసిన డెవిల్ సినిమాలు కూడా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ స్పై సినిమాలకు హాస్యం ఎక్కువైన, స్టోరీ తక్కువైన ఫెయిల్ అవ్వాల్సిందే. ఇక గతంలో విజయం సాధించిన గూఢచారి సినిమా.. మళ్లీ  సీక్వెల్ తో రానుంది. మరి ఈ సినిమా హిట్ కొడుతుందో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: