ప్రభాస్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండరు. ఎప్పుడో ఒకసారి సోషల్ మీడియాలో ఏదైనా ట్వీట్,పోస్ట్ చేస్తే మాత్రం అది హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే తాజాగా ప్రభాస్ పెట్టిన పోస్ట్ నెటిజన్స్ ని తెగ షాకింగ్ కి గురి చేస్తుంది. ప్రభాస్ నా లైఫ్ లోకి సంథింగ్ స్పెషల్ రాబోతుంది వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. దీంతో అందరూ ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని భావించారు. అయితే చాలా రోజుల నుండి ప్రభాస్ పెళ్లి రూమర్లు వినిపిస్తున్నప్పటికి ఏది నిజం అవ్వడం లేదు. దీంతో ప్రభాస్ ఏ చిన్న పోస్ట్ పెట్టినా కూడా దాన్ని పెళ్లికి సంబంధించిందే అని మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టారు.. నేను మీతో ఓ స్పెషల్ ప్రాజెక్టులో భాగమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.

వెయిటింగ్ ఫర్ సంథింగ్ అంటూ పోస్ట్ పెట్టారు.అయితే ఈ పోస్ట్ చేసింది తన పెళ్లి గురించి అయితే కాదు.డైరెక్టర్ హను రాఘవపూడి గురించి. అవును మీరు వినేది నిజమే. తాజాగా హను రాఘవపూడి బర్త్ డే సందర్భంగా ప్రభాస్ ఈ స్పెషల్ పోస్ట్ పెట్టారు. అయితే ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ స్టేటస్ పెట్టడంతోనే చాలామంది పెళ్లి గురించే అని మాట్లాడుకున్నారు.కానీ అది పెళ్లి గురించి కాదు డైరెక్టర్ హను రాఘవపూడి గురించి. ఇక ప్రభాస్ హాను రాఘవపూడి కాంబోలో ఫౌజీ మూవీ తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. అలా సీతారామం మూవీ తర్వాత హను రాఘవపూడి నుండి వస్తున్న సినిమా కాబట్టి ఫౌజీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇందులో హీరో కాబట్టి అంచనాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇక ప్రభాస్ ని ఫౌజీ మూవీలో హను రాఘవపూడి చాలా కొత్తగా చూపించబోతున్నారు. ఈ సినిమాలో ఆయన మిలిటరీ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈ మిలిటరీ పాత్రలోనే ఒక అద్భుతమైన ప్రేమకావ్యాన్ని కూడా హనురాఘవపూడి తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికి డైరెక్టర్ బర్త్ డే కోసం ప్రభాస్ పోస్ట్ పెడితే అందరూ ప్రభాస్ కి సంబంధించి ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నారా అని పొరపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: