
అయితే అలాంటి రాజమౌళి ఆయన తెరకెక్కించిన ఒక సినిమా ఫ్లాప్ అవుతుందేమో అంటూ భయపడ్డాడు .. టెన్షన్ పడ్డాడు . ఆ సినిమా మరేంటో కాదు "సై". నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది . రగ్ బీ అనే ఒక గేమ్ గురించి జనాలకి తెలిసేలా చేసింది. అయితే ఈ సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కడంతో ఈ సినిమాని తెలుగు జనాలు లైక్ చేస్తారా..? లేదా..? అని చాలా టెన్షన్ పడ్డారట. సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజు బాగా టెన్షన్ గా ఫీల్ అయిపోయారట.
అయితే సినిమా ఫస్ట్ షో పడ్డాక నెగిటివ్ టాక్ అందుకుంది. రాజమౌళి బాగా భయపడిపోయారట . సినిమా ఫ్లాప్ అయిపోతుంది ఏమో అంటూ టెన్షన్ పడ్డారట . అయితే రెండు మూడు షోలు పడ్డాక మౌత్ టాక్ వచ్చాక సినిమాకి మంచి పబ్లిసిటీ దొరికింది . సినిమా మంచి హిట్ అయింది . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే చాలామంది ఇంట్రెస్టింగ్గా బోర్ కొట్టకుండా చూస్తూ ఉంటారు . అంతలా ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించాడు రాజమౌళి. నితిన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచిపోయింది...!!