- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నంద‌మూరి నటసింహం బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘ అఖండ ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూశాం. నిజం చెప్పాలంటే బాల‌య్య కు సెకండ్ ఇన్సింగ్‌లో అఖండ హిట్ బ‌ల‌మైన పునాది వేసింది .. అఖండ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు తెర‌కెక్కుతోన్న అఖండ 2 - తాండ‌వం సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా పై ఓ క్రేజీ రూమ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమా లో సీనియ‌ర్ హీరోయిన్ విజ‌య‌శాంతి కూడా ఓ కీల‌క పాత్ర‌లో కనిపించ‌బోతోంద‌ట‌. పైగా ఆమె రాజ‌కీయ నాయ‌కురాలి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని స‌మాచారం.


గ‌తంలో బాలయ్య - విజయశాంతి కలయికలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి .. పైగా కల్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో విజయశాంతి నటించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ఇప్పుడు ఇన్నేళ్ల త‌ర్వాత మ‌రోసారి బాల‌య్య - విజ‌య‌శాంతి క‌లిసి తెర‌మీద క‌నిపిస్తే ఆ మ‌జాయే వేరు. ఇక ఈ సినిమా ను ముందుగా ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అయితే ఇప్పుడు వ‌చ్చే సంక్రాంతి రేసులో నిల‌పాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. సంక్రాంతికే చిరు - అనిల్ రావిపూడి సినిమా షెడ్యూల్ అయి ఉంది. ఇప్పుడు మ‌రోసారి సంక్రాంతికి చిరు - బాల‌య్య సినిమాలు పోటీ ప‌డితే అదిరిపోతుంది. ఏదేమైనా మ‌రోసారి బాల‌య్య .. చిరుకు త‌న అఖండ 2తో బాక్సాఫీస్ పోటీకి స‌వాల్ విసురుతున్నారు.


అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: