
నేషనల్ మీడియాలో కూడా మార్క్ శంకర్ పేరు షేక్ చేసేసింది . అయితే అంతకు ముందు వరకు కూడా మార్క్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ కొడుకు ... ఆ విధంగానే మాట్లాడుకునేవారు . కానీ ఇప్పుడు మార్క్ శంకర్ నెక్స్ట్ పవన్ వారసుడు అనే విధంగా మాట్లాడుకుంటున్నారు . ఇక్కడే పెద్ద తలనొప్పి క్రియేట్ అయింది . నిజానికి పవన్ వారసుడు అంటే అంతకుముందు అకిరానందన్ అని .. అంత చెప్పుకునే వారు . పవన్ కళ్యాణ్ రాజకీయ వారసుడిగా సినీ వారసుడిగా అఖీరానందన్ మాత్రమే సెట్ అవుతాడు అని అఖీరా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు .
అయితే ఎప్పుడైతే మార్క్ శంకర్ లైన్ లోకి వచ్చాడు అప్పటినుంచి పవన్ వారసుడు మార్క్ శంకర అని .. పవన్ కళ్యాణ్ రాజకీయ వారసుడిగా మార్క్ శంకర్ ఆ లెగసీని కంటిన్యూ చేయాలి అని ఓ వర్గం పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్గా మారింది . అకిరా నందన్ -మార్క్ శంకర్ ఇద్దరు పవన్ కళ్యాణ్ కొడుకులే .. పవన్ కళ్యాణ్ వారసులే ..వాళ్ళు ఏమవుతారు అనేది వాళ్ళ ఇష్టం .. మధ్యలో ఈ ఫ్యాన్స్ ప్రాబ్లం ఏంటి ..? అనేది ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఇష్యూస్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు..!!