
ఆర్జీవీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన పూరీ జగన్నాథ్ ఛో్టా కె నాయుడుకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పి ఒప్పించి పవన్ కళ్యాణ్ ను కలిశారు. పూరీ జగన్నాథ్ చెప్పిన కథ విని క్లైమాక్స్ మార్చాలని పవన్ కళ్యాణ్ కోరగా పూరీకి మాత్రం కొత్త క్లైమాక్స్ రాయాలనిపించలేదు. పవన్ సైతం తనకు అదే క్లైమాక్స్ నచ్చిందని పూరీ జగన్నాథ్ తో వెల్లడించడం గమనార్హం.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాడ్ ఏజెన్సీ కోసం పని చేసే పాత్రలో నటించారు. ఈ సినిమా అమీషా పటేల్ కు తొలి తెలుగు సినిమా కావడం గమనార్హం. ఈ సినిమా పూరీకి తొలి తెలుగు సినిమా కాగా ఈ సినిమాతో డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ సినిమా 85 సెంటర్లలో 50 రోజులు, 47 సెంటర్లలో 100 రోజుల పాటు ప్రదర్శించబడింది.
ఈ సినిమాలో బ్రహ్మానందం, మల్లిఖార్జున రావు మధ్య వచ్చే కామెడీ సీన్లు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పవన్ తర్వాత సినిమాలు ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతాయో చూడాల్సి ఉంది.
పవన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. పవన్ సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రణా్ళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. పవన్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. పవన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.