ప్రస్తుతం మన స్టార్ హీరోల మధ్య ఊహించని ఇంట్రెస్టింగ్ ఫైట్ నడుస్తుంది .. ఇప్పటివరకు సక్సెస్ , కలెక్షన్ల విషయంలో మన హీరోలు గట్టి పోటీపడ్డారు .. కానీ ఇప్పుడు వాళ్ళ సినిమాలు బడ్జెట్ విషయంలో కూడా ఒకరి నుంచి ఒకరు పోటీ పడుతున్నారు .. ఇక దీంతో వారి అపకమింగ్ సినిమాల బడ్జెట్ నెంబర్స్ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జ‌నాలకు కూడా షాక్ ఇస్తున్నాయి .. ఇప్పుడు ఏ సినిమాలు ఎంత బడ్జెట్ తో వస్తున్నాయి అనేది ఈ స్టోరీలో చూద్దాం .. ఇప్పటికీ మన స్టార్ హీరోల కలెక్షన్లు 1000 కోట్ల మార్కును  దాటేయడంతో బడ్జెట్ విషయంలో కూడా అదే రేంజ్ లో ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు ..


ప్రధానంగా పుష్ప 2 , కల్కి సినిమాల సక్సెస్ తర్వాత నిర్మాతల్లో కాన్ఫిడెన్స్ భారీగా పెరిగింది .. అందుకే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న స్టార్ హీరోల సినిమాలు కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు నిర్మాత‌లు .. మహేష్ , రాజమౌళి సినిమా బడ్జెట్ 1000 కోట్లు పైనే ఉంటుందన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది .. అలాగే రీసెంట్గా ప్రభాస్ పౌజీ సినిమా బడ్జెట్ ఎంతో రివిల్ చేశారు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి దాదాపు 700 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు .. ఆ తర్వాత చేయబోయే స్పిరిట్ సినిమా కోసం అంతకు మించి బడ్జెట్ రెడీ చేసుకుంటున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ .. ఇక దేవర సినిమా కోసమే 300 కోట్లు ఖర్చు పెట్టాడు ఎన్టీఆర్ ..


ఇక ఇప్పుడు తన తర్వాతి సినిమాల బడ్జెట్ కూడా అంతకుమించి పెరిగిపోయింది .. ఎన్టీఆర్ ప్రశాంత్‌ నిల్ కాంబోలో వస్తున్న  డ్రాగన్ సినిమా కోసం దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతుంది సినిమా టీం .. ఇదే క్రమంలో సినీ జనాలకు షాక్ ఇచ్చే రేంజ్ లో బడ్జెట్ లెక్కలు చూపిస్తున్న మూవీ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న మూవీ .. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాలో ఒకటి .. అందుకే ఈ సినిమా మీద కూడా ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు రెడీ అవుతున్నారు .  కాస్త అటు ఇటుగా ఈ సినిమా బడ్జెట్ కూడా 1000 కోట్లకు దగ్గరలో ఉంటుందని తెలుస్తుంది .. ఈ విధంగా సినిమా బడ్జెట్ లెక్కల విషయం లో ప్రేక్షకులు అంచనాలు కూడా ఊహించని రేంజ్ కు పెంచేస్తున్నారు మన హీరోలు ..

మరింత సమాచారం తెలుసుకోండి: