టాలీవుడ్ లో రోజురోజుకి కొత్త కొత్త హీరోయిన్లు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. అందులో కొంతమంది సక్సెస్ సాధించగా.... మరి కొంత మంది సక్సెస్ అందుకోలేకపోతున్నారు. కొంతమంది అమ్మాయిలు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంటారు. అలాంటి వారిలో నటి మృనాల్ ఠాకూర్ ఒకరు. ఈ బ్యూటీ మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో మరాఠీ సినిమాల ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 


మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న ఈ చిన్నది మరాఠీ, హిందీ, తెలుగులో సినిమా అవకాశాలను అందుకుంది. ఇక తెలుగులో సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది తన నటన అందచందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించిన మృణాల్ సీతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం మృనాల్ ఠాకూర్ వరుసగా తెలుగు లో సినిమాలలో నటిస్తూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది.


ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ పలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ తన అందమైన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు చాలా అందంగా ఉన్నావని కామెంట్స్ సైతం చేస్తారు. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ కు సంబంధించి ఓ వార్తను సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.

మృనాల్ ఠాకూర్ ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేదని ఇప్పుడు పూర్తిగా తన అందాన్ని కోల్పోయిందంటూ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఒకప్పుడు మృణాల్ ఠాకూర్ ను చూస్తే చాలా బాగుండేదని ఇప్పుడు ఏమైనా సర్జరీ చేయించుకుందా లేకపోతే తనకు ఏమైందో తెలియడం లేదంటూ కొంతమంది సోషల్ మీడియాలో అనేక రకాలుగా వార్తలను వైరల్ చేస్తున్నారు. ఈ వార్తలపై మృనాల్ ఠాకూర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: