
ఇక ఆమె ఎవరో కాదు తెలుగు అమ్మాయిగా పేరుపొందిన హీరోయిన్ కామాక్షి భాస్కర్ల.. వృత్తిరీత్యా వైద్య కోర్సును చైనాలో ఎంబిబిఎస్ పూర్తి చేసింది.ఆ తర్వాత కొన్నేళ్లపాటు అపోలో ఆసుపత్రిలో వైద్యురాలిగా పలు రకాల సేవలు అందించింది. కానీ ఇండస్ట్రీలో నటించడం ఇష్టం ఉండడంతో అలా ఎంట్రీ ఇచ్చిందట. 2018లో మిస్ తేలంగాణ గా కూడా పోటీ చేసి గెలిచింది.ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకోవడంతో ప్రియురాలు సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైంది కామాక్షి భాస్కర్ల.
ఇక తెలుగులో మా ఊరి పొలిమేర, విరూపాక్ష, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, పొలిమేర 2, ఓం భీమ్ బుష్ తదితర చిత్రాలలో కూడా నటించింది. అలాగే సైతాన్, ఝాన్సీ తదితర వెబ్ సిరీస్లలో కూడా నటించిన కామాక్షి భాస్కర్ల ఇప్పుడిప్పుడే వరుసగా పలు చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నది. ఒకవైపు చేతినిండా సినిమాలతో మరొకవైపు సోషల్ మీడియాలో మాత్రం టూ హాట్ గ్లామరస్ గా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది కామాక్షి భాస్కర్ల. అయితే కామాక్షి భాస్కర్ల వృత్తిరీత్యా వైద్యురాల అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మొత్తానికి ఈ విషయంతో మరొకసారి వార్తల్లో నిలుస్తోంది.