
ఆమధ్య భుజం గాయంతో కూడా ఆసుపత్రిలో చేరి మరి సర్జరీ చేయించుకుంది.అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మీ గౌతమ్. గత కొద్దిరోజులుగా తన ఆరోగ్యం ఏమీ బాగాలేదని జనవరి నుంచి కంటిన్యూగా తనకు రక్తస్రావం అవుతోందని.. భుజాలు కూడా ఎక్కువగా నొప్పి వస్తున్నాయి ఆ బాధను భరించలేక ఈ సమస్య గురించి తాను వైద్యులను కలవాల్సి వచ్చింది.. అయితే ఎలాగోలాగా మార్చి 29 వరకు తాను మేనేజ్ చేయగలిగాను కానీ ఆ తర్వాత నా ఆరోగ్యానికి ఏదో తేడా కొడుతుందనే అనుమానం కూడా వచ్చిందని అందుకే తన కమిట్మెంట్లను పూర్తి చేసుకుని మరి హాస్పిటల్ కి వచ్చానని తెలిపింది.
ఇక రష్మీ గత కొద్దిరోజులుగా తనకు విపరీతంగా రక్తస్రావం , ఒళ్ళు నొప్పులు కూడా ఎక్కువగా వచ్చాయని చివరికి తన హిమోగ్లోబిన్ స్థాయి కూడా తొమ్మిదికి రావడంతో ఏం జరుగుతుందో అర్థం కాక హాస్పిటల్ కి చేరానని అయితే ఏప్రిల్ 18న ఆపరేషన్ పూర్తి అయిందని ఇప్పుడు తాను క్షేమంగా ఉండాలని తెలిపింది తనకు ఐదు రోజులపాటు తోడుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు హాస్పటల్ టీంకు స్నేహితులకు ధన్యవాదాలు అంటూ తెలియజేసింది రష్మి గౌతమ్.